© 2026 nimisham.in

మనం రోజూ వాడుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీల యుగంలోకి అడుగుపెట్టిన మన దేశంలో.. బ్యాంకింగ్ సాక్ష్యాల కోసం ఇప్పటివరకు 1891 నాటి అంటే ఏకంగా 135 ఏళ్ల నాటి పాత చట్టాన్నే వాడుతున్నామంటే ఆశ్చర్యం కలగక మానదు. బ్రిటిష్ కాలంలో పేపరు ఖాతాలు, పెద్ద పెద్ద రిజిస్టర్లను ఉద్దేశించి చేసిన ఆ పాత చట్టానికి కాలం చెల్లిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ఇటీవలే బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026ను ఆమోదించి, డిజిటల్ రికార్డులకు చట్టబద్ధమైన పవర్ ఇచ్చింది.ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు కోర్టులో పక్కా ప్రూఫ్!ఈ కొత్త చట్టం తెచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. బ్యాంకుల్లో నిర్వహించే ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను కోర్టు విచారణల్లో పూర్తిస్థాయి సాక్ష్యాలుగా గుర్తిస్తారు. ఒకప్పుడు చేతితో రాసిన పుస్తకాలను మాత్రమే సాక్ష్యంగా తీసుకునేవారు. కానీ ఇకపై బ్యాంకులు భద్రపరిచే కంప్యూటర్ రికార్డులు, ఆన్లైన్ స్టేట్మెంట్లు న్యాయస్థానాల్లో నేరుగా ఆధారాలుగా నిలుస్తాయి. అయితే ఇవి హ్యాకింగ్ కాకుండా, సమాచారం తారుమారు కాకుండా ఉండేలా బ్యాంకులు కచ్చితమైన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒరిజినల్ బుక్స్ అక్కర్లేదు.. సర్టిఫైడ్ కాపీ ఉంటే చాలు!సాధారణంగా ప్రతి చిన్న కేసుకు బ్యాంకు ఒరిజినల్ రికార్డులను, సర్వర్లను కోర్టుకు మోసుకొని రావడం సాధ్యం కాదు. ఈ సమస్యను నివారించడానికి బ్యాంకులు ఇచ్చే సర్టిఫైడ్ కాపీ ని ఆధారంగా స్వీకరించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల న్యాయస్థానాల్లో కేసుల విచారణ వేగవంతమవుతుంది. అలాగే బ్యాంకు అధికారులు అనవసరంగా రోజుకో కేసుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పనిలేకుండా వారికి రక్షణ కల్పించారు. రికార్డులపై ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు వారిని నేరుగా హాజరుకావాలని ఆదేశిస్తుంది.బ్యాంకుల రూపురేఖలు చేంజ్: నిర్మలా సీతారామన్ బిగ్ అనౌన్స్మెంట్!పోలీసులకు డైరెక్ట్ యాక్సెస్.. ప్రైవసీపై కొత్త చర్చ!ఈ చట్టంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశం.. దర్యాప్తు సంస్థలు
మనం రోజూ వాడుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీల యుగంలోకి అడుగుపెట్టిన మన దేశంలో.. బ్యాంకింగ్ సాక్ష్యాల కోసం ఇప్పటివరకు 1891 నాటి అంటే ఏకంగా 135 ఏళ్ల నాటి పాత చట్టాన్నే వాడుతున్నామంటే ఆశ్చర్యం కలగక మానదు. బ్రిటిష్ కాలంలో పేపరు ఖాతాలు, పెద్ద పెద్ద రిజిస్టర్లను ఉద్దేశించి చేసిన ఆ పాత చట్టానికి కాలం చెల్లిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో ఇటీవలే బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026ను ఆమోదించి, డిజిటల్ రికార్డులకు చట్టబద్ధమైన పవర్ ఇచ్చింది.ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు కోర్టులో పక్కా ప్రూఫ్!ఈ కొత్త చట్టం తెచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. బ్యాంకుల్లో నిర్వహించే ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను కోర్టు విచారణల్లో పూర్తిస్థాయి సాక్ష్యాలుగా గుర్తిస్తారు. ఒకప్పుడు చేతితో రాసిన పుస్తకాలను మాత్రమే సాక్ష్యంగా తీసుకునేవారు. కానీ ఇకపై బ్యాంకులు భద్రపరిచే కంప్యూటర్ రికార్డులు, ఆన్‌లైన్ స్టేట్‌మెంట్లు న్యాయస్థానాల్లో నేరుగా ఆధారాలుగా నిలుస్తాయి. అయితే ఇవి హ్యాకింగ్ కాకుండా, సమాచారం తారుమారు కాకుండా ఉండేలా బ్యాంకులు కచ్చితమైన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒరిజినల్ బుక్స్ అక్కర్లేదు.. సర్టిఫైడ్ కాపీ ఉంటే చాలు!సాధారణంగా ప్రతి చిన్న కేసుకు బ్యాంకు ఒరిజినల్ రికార్డులను, సర్వర్లను కోర్టుకు మోసుకొని రావడం సాధ్యం కాదు. ఈ సమస్యను నివారించడానికి బ్యాంకులు ఇచ్చే సర్టిఫైడ్ కాపీ ని ఆధారంగా స్వీకరించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల న్యాయస్థానాల్లో కేసుల విచారణ వేగవంతమవుతుంది. అలాగే బ్యాంకు అధికారులు అనవసరంగా రోజుకో కేసుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పనిలేకుండా వారికి రక్షణ కల్పించారు. రికార్డులపై ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు వారిని నేరుగా హాజరుకావాలని ఆదేశిస్తుంది.బ్యాంకుల రూపురేఖలు చేంజ్: నిర్మలా సీతారామన్ బిగ్ అనౌన్స్‌మెంట్!పోలీసులకు డైరెక్ట్ యాక్సెస్.. ప్రైవసీపై కొత్త చర్చ!ఈ చట్టంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశం.. దర్యాప్తు సంస్థలు, పోలీసులకు ఇచ్చిన అధికారాలు. ఏదైనా తీవ్రమైన ఆర్థిక నేరం, జాతీయ భద్రత, వ్యవస్థీకృత నేరాల విచారణ జరుగుతున్నప్పుడు.. కోర్టు అనుమతితో పనిలేకుండానే పోలీసులు నేరుగా బ్యాంకుల నుంచి ఖాతాదారుల లావాదేవీల వివరాలు పొందవచ్చు. అయితే మీ ఖాతా వివరాలు పోలీసులు సేకరించిన విషయాన్ని బ్యాంకు మీకు తెలియజేయాలి. కానీ నేర విచారణకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ సమాచారాన్ని ఖాతాదారుడికి చెప్పకుండానే సేకరించేందుకు పోలీసులకు మినహాయింపునిచ్చారు. దీంతో వినియోగదారుల డేటా ప్రైవసీపై మరోసారి చర్చ మొదలైంది.పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చట్టం పరిధిలోకి ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు!కేవలం సాంప్రదాయ బ్యాంకులే కాకుండా.. భవిష్యత్తులో ఇతర ఆర్థిక సంస్థలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు), పెన్షన్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర డిజిటల్ ఫైనాన్షియల్ యాప్‌లు కూడా ఈ కొత్త చట్టం పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల దేశంలో ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతీ వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు గురైనప్పుడు వేగంగా న్యాయం జరిగే అవకాశం ఏర్పడుతుంది.