
క్రోసూరు (అచ్చంపేట), న్యూస్టుడే: క్రోసూరు మండలం 88 త్యాళ్లూరులో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగొచ్చినందుకు తల్లి మందలించిందని అన్నాతమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రోసూరు మండలం 88త్యాళ్లూరుకు చెందిన లంకోటి రత్తయ్యకు కోటేశ్వరరావు (26), సీతారామయ్య (24) కుమారులు. ఇద్దరికీ వివాహం అయ్యింది. తాగుడుకు అలవాటుపడ్డారు. సోమవారం రాత్రి కూరగాయలు తీసుకురావడానికి వెళ్లి తాగి వచ్చారు. తీవ్రజాప్యం జరిగిందని తల్లి ఆదిలక్ష్మి మందలించింది. మనస్తాపానికి గురై శీతలపానియంలో పురుగుల మందు కలుపుకుని తాగారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మంగళవారం ఉదయం మృతిచెందాడు. సీతారామయ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు యువకులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కోటేశ్వరరావుకు భార్య సీతామహాలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు క్రోసూరు ఎస్సై పి.రవిబాబు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు