
జాతీయ జెండా ప్రదర్శిస్తున్న కళాశాల విద్యార్థులు న్యూస్‌టుడే, వినుకొండ, చిలకలూరిపేట గ్రామీణ: ఎందరో మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్రమని, వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వినుకొండ, చిలకలూరిపేటలో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. వినుకొండలో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు 300 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ర్యాలీలో పాల్గొన్నారు. చిలకలూరిపేటలో ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 200 అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. పాత పశువుల సంత వద్ద ఎమ్మెల్యే ప్రత్తిపాటి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ సమైక్యత చాటాలన్నారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.