
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో పాటు సామన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారు. అయితే సుమారు మూడేళ్ల క్రితమే ఏడో సీజన్ లో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే విజేతగా నిలిచిన అనంతరం తన బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచు తానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే తీరా చూస్తే రైతులకు డబ్బు సాయం గురించి అసలు పట్టించుకోలేదు పల్లవి ప్రశాంత్. ఈ విషయంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడీ బిగ్ బాస్ విన్నర్. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనను పూర్తిగా మోసం చేశారంటూ వాపోయాడు. బిగ్ బాస్ రియాలిటీ షో నేను గెలుచుకున్న ప్రైజ్‌మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే కారు తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? చివరకు ప్రైజ్‌మనీలో నుంచి తీసుకుంటామని