© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఆయేషా గిలామనా అలియాస్ శంసో బీబీ (28) అనే టిక్‌టాకర్ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలా ప్రాంతంలో తోబుట్టువులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో.. ఆమె సోదరి అసీమాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయేషాకు టిక్‌టాక్‌లో 13 లక్షలమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. కాషిఫ్ అనే వ్యక్తి తన కుమార్తెకు ఫోన్ చేసి బయటకు రావాలని కోరాడని.. ఈ క్రమంలోనే ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో వెళ్లారని ఆయేషా తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌసర్, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులతో ఆమెకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని, ఆ ఇద్దరే ఈ హత్య చేయించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కాషిఫ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో గతేడాది నుంచి మహిళా ఇన్ఫ్లుయెన్సర్ హత్యకు గురికావడం ఇది ఐదోసారి. అంతకుముందు సనా జావెద్, సనా యూసఫ్, మెహక్ శెహజాదీ సైతం వేర్వేరు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సుమీరా రాజ్‌పుత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ను విషమిచ్చి హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.