
Pakistan| ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారట. వారిని లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పంపాడని పాక్‌లోని ఒక మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆగస్టు 14న బోధకుడు నాసిర్ మద్నీ మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బహావల్ నగర్లో లష్కరే అనుబంధ కార్యక్రమంలో అతడు మాట్లాడుతూ.. సయీద్‌ను మాతృభూమి సేవకుడిగా అభివర్ణించాడు. దీంతో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల వెనక హఫీజ్ ప్రమేయం ఉందని మరింత తేటతెల్లమవుతోంది. అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాల కారణంగా 2005లో లష్కరే ఉగ్రసంస్థను ఐరాస నిషేధించింది. దాని చీఫ్ హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 26/11 ముంబయి దాడులతో సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రఘటనలకు సంబంధించిన దర్యాప్తులో అతడి పేరు చాలా సార్లు వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులో జమ్ము న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర్నుంచి.. కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఆధారాలున్నాయని ఎన్ఐఏ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు