
రేటింగ్: 3/5 సాగర్ (కృష్ణబాబు), చిత్ర (చిత్ర శుక్ల) ప్రేమలో మునిగి తేలుతున్న జంట. కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ, తమ ప్రయాణాన్ని కెమెరాలో బంధిస్తూ గడపాలని పహల్గామ్కి వెళ్తారు. కానీ ఓ అనుకోని క్షణంలో వాళ్ల కెమెరా ఒక హత్యను రికార్డ్ చేయడంతో ఆ అందమైన ప్రయాణం ఒక్కసారిగా ప్రమాదకరమైన ఆటగా మారుతుంది. ఆ హత్య వెనుక ఉన్నది ఉగ్రవాదుల ముఠా కావడంతో.. ఆ కెమెరాలోని ఫుటేజ్ వారికి కీలకమైన ఆధారంగా మారుతుంది. ఆ ఫుటేజ్ తమ చేతికి రాకపోతే తమ రహస్యం బయటపడుతుందని గ్రహించిన ఉగ్రవాదులు సాగర్, చిత్రలను వెంబడించడం మొదలుపెడతారు. చిత్రను కాపాడేందుకు సాగర్ ఆమెను సురక్షితంగా తన ఊరికి పంపిస్తాడు. కానీ తాను మాత్రం వారి ఉచ్చులో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి కథలో మరో టర్న్ తీసుకుంటుంది. సాగర్‌పై వరుసగా నేరాలు మోపబడతాయి. నిజమైన నేరస్థులు నీడల్లో ఉండగా.. సాగర్ మాత్రం పోలీసుల దృష్టిలో అనుమానితుడిగా మారిపోతాడు. ఇదిలా ఉంటే, చిత్ర కుటుంబం కూడా ఉగ్రవాదుల ఒత్తిడికి గురవుతుంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న చిత్ర.. సాగర్ ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడని గ్రహిస్తుంది. అతడిని కాపాడుకోవడానికి ఆమె స్వయంగా ఆ ప్రమాదం వైపు అడుగులు వేస్తుంది. సాగర్‌ను వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ ఆమెకు ఆ కెమెరా ఫుటేజ్ వెనుక దాగి ఉన్న అసలు కుట్రపై మరిన్ని ఆధారాలు దొరుకుతాయి.అప్పుడు చిత్ర ఏం చేసింది. సాగర్ ని ఎలా రక్షించింది. ఉగ్ర కుట్రను ఎలా బయిటపెట్టింది. అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. ఎనాలిసిస్ కథా పరంగా చూస్తే.. ప్రేమకథను ఒక థ్రిల్లర్‌కు ఎమోషనల్ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఒక సాధారణ ప్రయాణంలో జరిగిన అనుకోని సంఘటన ఇద్దరి జీవితాలను తలకిందులు చేయడం మంచి హుక్‌ను అందిస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్‌కు మరింత బలమైన మిస్టరీ లేయర్, విలన్‌కు మరింత వ్యూహాత్మకమైన ప్రెజెన్స్ ఉంటే