
ఇంటర్నెట్ డెస్క్: సన్నిహితంగా గడిపేందుకు ఓ ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ సమయానికి ముందే తరగతులు ముగిస్తున్నారు. దీనిపై విద్యార్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఛింద్వాడాలో చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీచ్ బహీర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు.. అదే స్కూల్లోని మహిళా టీచర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు.. సమయం కంటే ముందుగానే తరగతులు ముగించి, విద్యార్థులను ఇళ్లకు పంపించేస్తున్నారు. వారి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించి.. ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనర్ సత్యేంద్ర సింగ్‌ను కలెక్టర్ ఆదేశించారు. విచారణలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధం ఉందని తేలడంతో వారిని వేర్వేరు పాఠశాలలకు బదిలీ చేశారు. సదరు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త అతిథి ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. ఇదీ చదవండి: వందేభారత్ కోచ్‌లోకి దూరేందుకు కొండచిలువ యత్నం.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది