
మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? ఓటీటీలో దృశ్యం లాంటి మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. రెండు గంటల కంటే తక్కువగా నిడివి ఉండడం ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకున్న మరో స్పెషాలిటీ. అలాగే ఈ చిత్రం అనేక అవార్డులను కూడా గెలుచుకుంది, తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అది కూడా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు 10కి 8.2 రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ప్రమాదం కారణంగా కాలేజీ రోజుల నాటి ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తూ కాలు కోల్పోయిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్, తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసును ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథ.. స్టోరీ మొత్తం రిటైర్డ్ పోలీస్ అధికారి దీపక్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో దీపక్ తన కాళ్లను కోల్పోతాడు. అయితే కెరీర్ లో తన చివరిగా, అసంపూర్తిగా ఉన్న ఓ కేసు గురించి విచారణ మొదలు పెడతాడు. ఇదే క్రమంలో ఒకే రాత్రి మూడు వేర్వేరు సంఘటనలు (ప్రమాదం, ఆత్మహత్య, హత్య) జరుగుతాయి. మరి ఈ సంఘటనలు, దీపక్ విచారిస్తోన్న కేసుకు సంబంధమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే. చివరి వరకు థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహించలేని షాక్ ఇస్తుంది.