
బొండారిపొఖరి వరద ప్రాంతాల్లో భద్రక్ ఎంపీ అభిమన్యు శెఠి పరిశీలన భువనేశ్వర్, న్యూస్టుడే: ఉత్తరకోస్తాలో వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఊళ్లను, పంటలను ముంచెత్తాయి. కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కేంద్రపడ జిల్లా పట్టాముండైలోని ఆశ్రమ పాఠశాల జల దిగ్బంధమైంది. ఈ స్కూల్లో 300 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందీ లేదని, చుట్టూ నీరున్నా తక్షణ ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ప్రమాదం తప్పదని భావిస్తే వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని వివరించారు. బంగాళాఖాతంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరకోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే నదుల్లో ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. విపత్తుల నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు