
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ వైద్యకళాశాల- ఆసుపత్రిలోని వాష్‌రూమ్‌లో ఆమె విగతజీవిగా కనిపించారు. అక్కడున్న సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగలకొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వయసున్న ఓ నర్సు.. ఇక్కడి గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు హాజరైన ఆమె.. రాత్రి 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లారు. ఎంతకూ బయటకు రాకపోవడం, పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడున్న సిబ్బంది తలుపులు పగలకొట్టారు. అక్కడే నేలపై అపస్మారక స్థితిలో ఆమెను గుర్తించారు. హైవే అంబులెన్సులు.. 10 నిమిషాల్లో చేరుకోకుంటే రూ.10వేల పెనాల్టీ వెంటనే చికిత్స కోసం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహంపై ఎటువంటి గాయాల ఆనవాళ్లు కనిపించలేదని, ఆత్మహత్య లేఖ కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. ఇంజక్షన్ ద్వారా మత్తు మందును అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శరద్వత్ ముఖర్జీ ఆసుపత్రిని సందర్శించి వివరాలు ఆరా తీశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి