
విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అనగానే చాలామందికి ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో లక్ష డాలర్ల వార్షిక వేతనం అందుకుంటే చాలు, అతడు "కోటీశ్వరుడు" అయిపోయాడని బంధుమిత్రులు భావిస్తుంటారు. అయితే, ఈ అంచనాల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కరణ్ సింగ్ గిల్ అనే ప్రవాస భారతీయుడు ఒక వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఆయన పంచుకున్న ఈ వీడియో, విదేశీ సంపాదన వెనుక ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టింది.తాను ఆస్ట్రేలియాలో ఏడాదికి లక్ష డాలర్లు సంపాదిస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, వారు వెంటనే దాన్ని భారత కరెన్సీలోకి మార్చి (సుమారు 67 లక్షల రూపాయలు) తాను సంపన్నుడినని ప్రకటించారని గిల్ తెలిపారు. అయితే, ఈ లెక్క ఎంత తప్పుదో ఆయన వివరించారు. "ఆ 67 లక్షల రూపాయలు ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలోనే ఖర్చు అవుతాయి. కాబట్టి అక్కడి జీవన వ్యయాలతోనే దాన్ని పోల్చాలి" అని ఆయన స్పష్టం చేశారు.ఖర్చుల లెక్క ఇదే..గిల్ తన లక్ష డాలర్ల జీతంలో ఖర్చులు ఎలా పోతాయో ఉదాహరణగా వివరించారు:పన్నులు: వార్షిక జీతం 100,000 డాలర్లలో పన్నులు, మెడికేర్ లెవీ కింద సుమారు 22,788 డాలర్లు పోతాయి. దీంతో చేతికి వచ్చేది దాదాపు 77,000 డాలర్లు.ఇంటి అద్దె: ఆస్ట్రేలియాలో సగటున వారానికి 500 డాలర్లు అద్దె చెల్లించాల్సి వస్తే, ఏడాదికి 26,000 డాలర్లు అవుతుంది. దీంతో మిగిలేది 51,000 డాలర్లు.ఇతర ఖర్చులు: నిత్యావసరాలు, రవాణా, విద్యుత్, ఫోన్ బిల్లులు, బీమా