© 2026 nimisham.in

అమెజాన్ ఇండియాలో నథింగ్ ఫోన్ 3 ధర భారీ తగ్గింపు

కొనుగోలుదారులు అదనపు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్

ఈ ఫోన్ హై రిఫ్రెష్ రేట్, డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్

Nothing Phone 3 Price Drop : నథింగ్ ఫోన్ లవర్స్ మీకోసమే.. అమెజాన్ ఇండియాలో నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కానీ, ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రస్తుతం రూ. 28వేలకుపైగా తగ్గింపుతో అమ్ముడవుతోంది.

అంతేకాదు.. కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 సీపీయూ, 6.67-అంగుళాల (Nothing Phone 3 Price Drop) అమోల్డ్ డిస్ప్లే ఫ్లాగ్షిప్-లెవల్ డిజైన్ అందిస్తుంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ :
భారత మార్కెట్లో నథింగ్ సంస్థ ఫోన్ 3 మోడల్ రూ. 79,999 ధరతో లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ హ్యాండ్సెట్ రూ. 51,699కే అమ్ముడవుతోంది. లాంచ్ ధరపై రూ. 28,300 నేరుగా తగ్గింపు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసే కస్టమర్లకు రూ. 3వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Read Also : Vivo X300 Pro Deal : ఏంది భయ్యా ఆఫర్.. వివో X300 ప్రో మరి ఇంత తక్కువకా? అమెజాన్‌లో జస్ట్..!

నెలకు కేవలం రూ. 1,818 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకునేవారికి, అమెజాన్ రూ. 32,800 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అయితే, ఫైనల్ రేటు అనేది మీ పాత డివైస్, బ్రాండ్ మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3 కొనాలా? వద్దా? :
నథింగ్ ఫోన్ (3) క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్సెట్ ద్వారా రన్ అవుతుంది. అదనంగా 16GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 65W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో 5,500mAh బ్యాటరీ కూడా ఉంది.

డిస్ప్లే విషయానికి వస్తే..
ఇందులో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HDR10+ అమోల్డ్ ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
కెమెరా ప్రియుల కోసం ఈ నథింగ్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కూడా ఉంది.
ఈ నథింగ్ ఫోన్ స్పెసిఫికేషన్లు చాలా ఆకర్షణీయగా ఉంటాయి. మీరు నథింగ్ ఫోన్ ఇష్టపడేవారు అయితే ఈ ఆఫర్ ఉండగానే కొనేసుకోవడం బెటర్. లేదంటే రాబోయే సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మరింత తగ్గే అవకాశం ఉంది. అప్పటివరకూ ఆగుతారా? లేదో మీరే డిసైడ్ చేసుకోండి.