AI Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో వేలాది ఉద్యోగాల కోతలు జరిగాయి. వరుసగా లేఆఫ్స్ చేపడుతుండడం కలవరపెడుతోంది. కానీ, భారతీయ ఉద్యోగ మార్కెట్ పై దీని ప్రభావం భిన్నంగా ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నోమురా (Nomura) వెల్లడించింది. భారత్‌లో ఏఐ కారణంగా కోల్పోయిన ఉద్యోగాలకంటే ఏఐ ఆధారిత టెక్నాలజీల వల్ల కొత్తగా సృష్టిస్తున్న ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉందని నోమురా తన నివేదికలో స్పష్టం చేసింది.లేఆఫ్స్‌తో పోలిస్తే భారత్‌లో ఏఐ నియామకాలు దాదాపు 3 రెట్లు ఉన్నట్లు నోమురా నివేదిక పేర్కొంది. 2022 నుంచి 2026 ఆగస్టు వరకు చూసుకుంటే భారతీయ కంపెనీలు ఏఐ కారణంగా 31,921 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇదే సమయంలో 83,100 ఏఐ ఆధారిత కొత్త నియామాకాలు చేపట్టినట్లు నివేదిక తెలిపింది. ఏఐ చాట్బాట్లను వినియోగించడంతో చాలా కంపెనీలు తమ సపోర్ట్ టీమ్స్‌లో కోతలు చేపట్టినట్లు తెలిపింది. అయితే, ఏఐ ఆధారిత డిమాండ్‌ను భర్తీ చేసేందుకు ఐటీ సేవల గ్రాడ్యుయేట్ల నియామకాలు పెరిగినట్లు తెలిపింది.ఏఐ విధానాలతో ఇండియా, సౌత్ కోరియా వంటి దేశాల్లో రెండంచెల కార్మిక మార్కెట్ సృష్టి జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గినావ్యాపార కార్యకలాపాల్లో అనుభవజ్ఞులైన ఉద్యోగులకు అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఆసియా వ్యాప్తంగా 1.3 లక్షలకు పైగా ఏఐ ఆధారిత నియామకాలు జరిగాయని తెలిపింది. ఇందులో 90 శాతం టెక్నాలజీ రంగంలోనే ఉన్నాయని పేర్కొంది.మరోవైపు.. ఆసియా కంపెనీలు గత నాలుగేళ్లలో 60,654 ఉద్యోగులను తొలగించాయని, అందులో 60 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోనే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఈ గణాంకాలు కార్మిక శక్తిపై ఉన్న అసమాన ప్రభావాలను కప్పిపుచ్చుతున్నాయని నోమురా హెచ్చరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా అరుదుగా ఏఐ ఇంజనీరింగ్ లోకి తిరిగి వెళ్తున్నారని పేర్కొంది. దీంతో ఏఐ