
విద్యుత్, నీటి సరఫరా సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, కొరియర్ కంపెనీల నుంచి వచ్చే సేవా, లావాదేవీల కాల్స్‌ను సులభంగా గుర్తించేలా కొత్త నంబరింగ్ విధానం అందుబాటులోకి రానుంది. ఆయా సంస్థలు ఇక 1601 సిరీస్ నంబర్ల నుంచి కాల్స్ చేసేలా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లతో వచ్చే నకిలీ కాల్స్, మోసాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. 1601 సిరీస్ నంబర్ కనిపిస్తే అది సంబంధిత సంస్థ నుంచి వచ్చిన అధికారిక సేవా లేదా లావాదేవీ కాల్ అని వినియోగదారులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.తొలి దశలో విద్యుత్ పంపిణీ సంస్థలు, నీటి సరఫరా సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వంటి యుటిలిటీ సేవల సంస్థలకు ఈ నంబర్లు కేటాయించనున్నారు. కొరియర్, ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, పార్సిల్ డెలివరీ, సరకు రవాణా సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.1601 సిరీస్ నంబర్లను అర్హత ఉన్న సంస్థలకు నేరుగా కేటాయిస్తారు. మధ్యవర్తులు, అగ్రిగేటర్లకు వీటిని ఇవ్వరు. టెలికాం సంస్థలు సంబంధిత సంస్థల వివరాలను ధ్రువీకరించిన తర్వాతే నంబర్లను కేటాయించనున్నాయి. తొలి దశలోని సంస్థల నమోదు, కొత్త విధానానికి మార్పు ప్రక్రియను ఆదేశాలు జారీ చేసిన తేదీ నుంచి 90 రోజుల్లో పూర్తి చేయాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు ఇప్పటికే 1600 సిరీస్ నంబర్లను ఉపయోగిస్తున్నాయి. ఆ విధానం ద్వారా వచ్చిన అనుభవంతో ఇతర రంగాలకూ నమ్మకమైన నంబరింగ్ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు ట్రాయ్