
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ బస్సుల్లో హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి బయల్దేరారు. ఈ క్రమంలో గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపానికి రాగానే ఓ బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సును హైవేపై నిలిపారు. బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి రహదారి మధ్యలోని డివైడర్‌పై కూర్చున్నారు. కాసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు కదిలి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు మహిళలు సునీత, చిటక్కకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలాన్ని నిజామాబాద్ సీపీ పి.సాయిచైతన్య పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు