
కామారెడ్డి: మండల పరిధిలోని శెట్టిపల్లి సంగారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. యాప్‌లో యూరియాను బుకింగ్ చేసుకున్న రైతులు సొసైటీ వద్దకు చేరుకోగా, సరిపడా స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్‌ను న్యూస్‌టుడే వివరణ కోరగా.. సాంకేతిక తప్పిదం కారణంగానే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు. సొసైటీలో 440 బస్తాల యూరియా ఉండగా, యాప్‌లో పొరపాటున 880 బస్తాలు ఉన్నట్లు నమోదైందని తెలిపారు. దీంతో స్టాక్ నిల్వ లేకపోయినా ఉన్నట్లు చూపించిందని తెలిపారు. ఆందోళనకు దిగిన రైతులకు సీఈవో నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ధర్నాను విరమించుకోకపోడంతో మండల వ్యవసాయాధికారి అనిల్ కుమార్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆయన ఘటనాస్థలికి చేరుకుని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, డిమాండ్‌కు సరిపడా యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు