
లింగంపేట: కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన మండలంలోని ముస్తాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.గ్రామస్థులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. ముస్తాపూర్‌కు చెందిన వడ్ల మౌనిక (27)కు మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల బహుగుణచారితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. భర్త జల్సాలకు అలవాటుపడి తరచూ వేధిస్తుండటంతో మౌనిక బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. వేధింపులపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బహుగుణచారి తనతో తెచ్చుకున్న కత్తితో అందరూ నిద్రిస్తున్న సమయంలో మౌనికపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు పథకం ప్రకారం దాడి చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు