
నవీపేట: అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన నవీపేట మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నిజామాబాద్ గ్రామీణ మండలం, నవీపేట ఠాణా పరిధిలోని జలాల్‌పూర్‌కు చెందిన హరీశ్ (36) అనే నవీపేట మండలం రాంపూర్‌కు చెందిన రేఖను 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. రేఖ తమ్ముడి పెళ్లిచూపుల నిమిత్తం దంపతులిద్దరూ సోమవారం రాంపూర్ వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రేఖ తల్లిగారింటి వద్ద ఉండగా హరీశ్ అదే రోజు తిరిగి వారి సొంతూరుకు వెళ్లారు. భార్యను తీసుకెళ్లేందుకు మంగళవారం రాంపూర్ వచ్చిన హరీశ్ అత్తగారింట్లోనే ఉండిపోయాడు. బుధవారం ఉదయం భర్త కుటుంబీకులకు రేఖ ఫోన్ చేసి హరీశ్ ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. మళ్లీ కొన్ని గంటలకే హరీశ్ చనిపోయినట్లు ఫోన్ చేసింది. అనంతరం యువకుడి కుటుంబ సభ్యులు రాంపూర్‌కు చేరుకుని హరీశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. హరీశ్ తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు అనుమాన్పాద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. అతని మృతికి కారణాలు తెలియరాలేదని ఈ మేరకు విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు