
నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.