
నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతి గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స Nizamabad Tragedy: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన మరో వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికుల అరుపులతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది. నిజామాబాద్(Nizamabad Tragedy) జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలో జాతీయ రహదారి 44 (NH-44) పై జరిగిన ఈ ఘోర రహదారి ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. Ponnam Prabhakar: బీసీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన టైరు పంచర్‌తో డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులు: పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వాట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పంచర్ కావడంతో గోవింద్‌పేట్ వద్ద రోడ్డు పక్కన నిలిపివేశారు. ఉక్కపోతగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి డివైడర్‌పై కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ నిలిపి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి ఎక్కడంతో మహారాష్ట్రకు చెందిన సుజాత, మాధవిలతో పాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఇద్దరిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం పరారైన కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు