
రాజంపేట: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో గణనాథులు కొలువుదీరారు. మండపాల నిర్వాహకులు విభిన్న ఆకృతుల్లో రూపొందిన గణపతి విగ్రహాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజంపేటలో నందీశ్వర ఫ్రెండ్స్‌ యూత్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి గణపతి శైలిలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామంలో ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తొలి రోజు యూత్ సభ్యులంతా కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





