
Nitish Kumar Reddy: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. మూడు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ప్రతి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన నితీష్, తొలి మ్యాచ్ విమర్శలకు తన ప్రదర్శనతోనే గట్టిగా సమాధానం ఇచ్చాడు.
Nitish Kumar Reddy: అంతర్జాతీయ క్రికెట్లో ఒడిదుడుకులు ఎదురైనా, పట్టుదల ఉంటే ఎలా పుంజుకోవచ్చో తెలుగోడైన యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నిరూపించారు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచారు. తొలి మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కొన్న నితీష్, ఈ మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు.



