
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann ) భార్య గుర్ప్రీత్ కౌర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేశారని పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషన్ స్పందించింది. ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖలోని మహిళా భద్రత విభాగానికి సైతం పంపింది. అయితే.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఆరోపణలపై పూర్తి వివరాలను పరిశీలించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు, దర్యాప్తు జరిగితే దాని పురోగతి ఏంటి? తదితర అంశాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించినట్లు సమాచారం. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఈ ఆరోపణలపై గుర్ప్రీత్ కౌర్ అధికారికంగా స్పందించలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు