
జాతీయ రహదారుల సంస్థ నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఓ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. జాతీయ రహదారులపై మోహరించిన అంబులెన్స్ సేవలకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై జాతీయ రహదారిపై ఎక్కడైనా ప్రమాదం సంభవించినప్పుడు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్స్ 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ నిర్ణీత సమయానికి చేరుకోకపోతే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. 10 నిమిషాల గడువును ఉల్లంఘించిన ప్రతిసారీ అంబులెన్స్ ఆపరేటర్లకు 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ప్రమాద స్థలం 10 కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే.. దానికి అనుగుణంగా ప్రయాణ సమయాన్ని దామాషా పద్ధతిలో పెంచుతారు. దీంతో పాటు అత్యవసర కాల్స్ లేదా టికెట్లను అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించిన ప్రతిసారీ రూ. 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ప్రమాద తీవ్రతను బట్టి అంబులెన్స్‌లు సకాలంలో స్పందించేలా చేసేందుకే ఈ జరిమానా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గోల్డెన్ అవర్ అంటే.. యాక్సిడెంట్ జరిగిన మొదటి గంట అత్యంత కీలకం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ తాజా నిబంధనను తెరపైకి తెచ్చింది. అలాగే.. అంబులెన్స్ కాల్ అంగీకరించిన సమయం నుంచి గరిష్టంగా ఒక గంట వ్యవధిలోనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చేర్చాల్సి ఉంటుంది.సగం భూగోళం చీకట్లో..: స్టన్నింగ్ వీడియోలుఈ గడువును దాటినా కూడా రూ. 10,000 జరిమానా వర్తిస్తుంది. ఒప్పంద నిబంధనల ప్రకారం అంబులెన్స్‌లో అవసరమైన మందులు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోయినా కూడా ఇదే విధమైన జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి వీలుగా ఎన్హెచ్ఏఐ కేర్ సిస్టమ్ (NHAI Care System) ద్వారా రోడ్డు భద్రతా విభాగాలను పటిష్టం చేయనున్నారు.సీఎం విజయ్ సైనింగ్ ఇన్ స్టైల్- తమిళనాడులో రూ. లక్ష కోట్ల పెట్టబడులు.. !!జాతీయ రహదారులపై