© 2026 nimisham.in

Team India : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో భారత జట్టు ఆటతీరుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నప్పటికీ, మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోయారు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంలో విఫలమవడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయింది. IND vs ENG : ఇంగ్లాండ్ పై ఘోర ఓటమి.. భారత్ మూటగట్టుకున్న చెత్త రికార్డులు ఇవే.. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 146 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. కేవలం 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత బౌలర్లు ఏ దశలోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. వీళ్లను తీసేయండి సార్.. భారత బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ, ప్రియాన్స్ యాదవ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్లో హ్యారీ బ్రూక్ 19 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను మరింత ఏకపక్షంగా మార్చింది. బ్యాటింగ్‌లోనూ సుందర్
కేవలం 5 పరుగులకే పరిమితమవడంతో అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ స్పిన్నర్లు వికెట్లు తీసిన చోట భారత స్పిన్నర్లు మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక ప్రసిద్ద్ కృష్ణ కూడా భారీగా పరుగులు ఇస్తుండడంతో అతడిపై కూడా విమర్శలు వస్తున్నాయి. పార్ట్ టైమ్ బౌలర్‌గా ప్రభావం చూపిస్తాడు అనుకున్న శివమ్ దూబె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వికెట్లు తీయడం సంగతి అటుంచితే భారీగా పరుగులు ఇస్తున్నాడు. Shreyas Iyer : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ రికార్డు సమం.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక కెప్టెన్.. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, ప్రసిద్ధ్ కృష్ణలను ముందుగా జట్టు నుంచి తప్పించాలని అప్పుడే భారత బౌలింగ్ విభాగం కాస్త అయినా బలంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Krunal is better bowler than Washington Sundar and prasidh krishna 🙏 — FilmiBeatss (@filmibeatss) July 10, 2026 In this series, Washington Sundar played 2 matches. He bowled 2 overs and conceded 38 runs with an economy of 19. Since he is playing as an all-rounder, this is a shameful selection by the selectors and team management. They are making a mockery of Indian cricket.… — CRICSUJEET.CS (@ANCHORSUJEET) July 9, 2026