
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods update: నేపాల్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా....2,500 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వారిలో దాదాపు 500 మంది విదేశీయులున్నారు. ఈ వరదల్లో కొన్ని గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికార లెక్కల్లోని దాదాపు 25 వేల నుంచి 30 మంది చనిపోయినట్టు అనధికార సమాచారం. ముఖ్యంగా హిమాలయాల్లోని హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో చైనా-నేపాల్ సరిహద్దులో ఏర్పడిన సరస్సు కారణంగా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. దాని వల్ల బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ వరద ముప్పుపై చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా దిగువ ప్రాంత ప్రజలను నేపాల్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వరద హెచ్చరికల మెసేజ్‌లతో దిగువ ప్రాంత ప్రజల ఫోన్లు దద్దరిల్లాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి, నిలువనీడలేకుండా మిగిలిన వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఈ అలర్ట్స్ మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, త్రిశూలీ నదికి దాదాపు మూడు గంటల పాటు వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. త్రిశూైలి -3ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోయిన కార్మికులు,.. వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కార్మికులు