
ముత్తుకూరు, న్యూస్‌టుడే: ముత్తుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మూడు నెలలకు పైగా పలు గ్రామాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి కొనుగోలుదారులు, అమ్మకందారులు అవస్థలు పడుతున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం, పైనాపురం, వెంకటాచలం మండలం సర్వేపల్లి బిట్-3 గ్రామాల పరిధిలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఆయా గ్రామాల్లో రీసర్వే కారణంగా సమస్యలు తలెత్తాయని, ఎల్పీ నంబర్లు అప్లోడ్ కాలేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌కు ఎల్పీ నంబర్లతో పాటు మార్కెట్ ధరలు కీలకం. ఇక్కడి సమస్యను అధికారులు తీర్చడం లేదని.. దీంతో సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగక నష్టపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులను సంప్రదిస్తే... ముత్తుకూరుకే వెళ్లాలని చెబుతున్నారని, ఇక్కడ అడిగితే అప్లోడ్ ప్రక్రియ పైనుంచి జరగాలని చెబుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి మూడు గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - మిల్కీరోషన్, సబ్‌రిజిస్ట్రార్, ముత్తుకూరు సాంకేతిక లోపం కారణంగా ఎల్పీ నంబర్లు పూర్తి స్థాయిలో అప్లోడ్ కాలేదు. దీంతో కృష్ణపట్నం, పైనాపురం, సర్వేపల్లి బిట్-3 గ్రామాల పరిధిలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రీ సర్వే తరువాత మార్కెట్ ధరలకు అనుమతి ఇచ్చాం. కృష్ణపట్నం పరిధిలో పూర్తి స్థాయిలో అప్డేట్ అయింది. మిగిలిన రెండు గ్రామాల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు