© 2026 nimisham.in

Navapanchama Rajayoga: గ్రహ మండలంలో దేవు గురువు బృహస్పతి రాక్షస గురువు అయిన శుక్రులు తమ కదలికతో నవ పంచమ రాజ యోగం ఏర్పడింది. దీంతో ఈ 5 రాశుల దశ, దిశ విధి రాత మారబోతుంది. అంతేకాదు ఆకస్మిక సంపదతో పాటు లాభాలను తీసుకురాబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారం ఘోషిస్తుంది. Navapanchama Rajayoga Effect 2026: అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారము తరువాత, శుక్రుడు బృహస్పతితో కలిసి నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.. రాక్షస గురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు... మిథునరాశిలో ఉన్న దేవ గురువు బృహస్పతితో కలిసి నవపంచమ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఐదవ ఇల్లు జ్ఞానం, ప్రేమ, అనురాగం, భావోద్వేగాలకు ప్రతీక. తొమ్మిదవ ఇల్లు అదృష్టం, మతంతో పాటు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అందువల్ల, నవ పంచమ యోగం ఏర్పడటం కొన్ని రాశుల వారికి మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి... సింహ రాశి: సింహ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు వారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. శుక్రుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన నవ పంచమ కలయిక సమయంలో గత ప్రయత్నాలతో గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు కోరుకున్న ఒప్పందాలను చేసుకుంటారు. మిథున రాశి: మిథున రాశి వారి తెలివితేటలు, జ్ఞానంలో పెరుగుదలను అనుభవిస్తుంటారు. ఇది వారి విద్యలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన ఏదైనా డబ్బు తిరిగి పొందవచ్చు. అదృష్టం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు, బృహస్పతి నవ పంచమ కలయిక వలన కుంభ రాశి వారికి
అన్ని రకాల విజయాలను అందించబోతుంది. అంతేకాదు వ్యాపార పరంగా.. ఉద్యోగ పరంగా గణనీయమైన లాభాలను అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా బలోపేతం అవుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఇదే అనువైన సమయం. ప్రయాణాలు కలిసొస్తాయి.
మేష రాశి: శుక్రుడు , బృహస్పతి ఆయా స్థానాల్లో ఉండటం మూలానా ఏర్పడిన నవ పంచమ కలయిక మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారు తమ కోరుకున్న స్థితిని పొందుతారు. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజయోగం ఏర్పడుతుంది. గత ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి పెట్టుబడులు గణనీయమైన ఆర్థిక లాభాలను తీసుకురాబోతుంది.
తుల రాశి: తులారాశి వారిలో సానుకూల శక్తిని అనుభవిస్తారు. విద్యార్థులు తమ విద్యా రంగంలో గణనీయమైన విజయాన్ని అందుకుంటారు. అదృష్టం మద్దతుతో మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంటుంది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కారం లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.