సోషల్ మీడియాలో పరిచయం.. కలుద్దామని ఆహ్వానం.. నమ్మి వెళ్లినందుకు నిలువు దోపిడీ.. నంద్యాల జిల్లాలో వెలుగు చూసిందీ దారుణం. సోషల్ మీడియాను, యువతరాన్ని వేర్వేరుగా ఊహించుకోలేని ప్రస్తుత పరిస్థితులలో.. యువతను అప్రమత్తం చేస్తోంది ఈ ఘటన. సోషల్ మీడియా చాటింగ్ యాప్‌లలో పరిచయమైన స్నేహాలు అన్నీ నమ్మదగినవి కాదని.. వెనకాముందు ఆలోచించకుండా అడుగేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తోంది. సోషల్ మీడియా యాప్‌లో పరిచయం కాస్తా స్నేహంగా మారి.. దోపిడీకి దారితీసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నంద్యాల పోలీసులు.. నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కత్తులు, రాడ్లు, డబ్బులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నంద్యాల అదనపు ఎస్పీ సుస్మిత ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.ఆగస్ట్ 15వ తేదీ రాత్రి పది గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద ఓ యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆగస్ట్ 17వ తేదీ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి.. బుధవారం రోజు రాత్రి నందమూరి నగర్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.అయితే బాధితుడికి.. నిందితుల్లోని ఓ యువకుడికి మధ్య సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపార. ఓ చాటింగ్ యాప్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయంతోనే ఓ ఫంక్షన్ ఉందని, స్నేహితులతో పాల్గొందామని అతన్ని ఆహ్వానించినట్లు పోలీసులు తెలిపారు. అతను రాగానే బెదిరించి, ఐరన్ రాడ్‌తో దాడి చేసి అతని