
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది తాజాగా నిందితుల పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఇద్దరు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు 8 రోజుల్లో ఈ హత్య కేసును ఛేదించారు.ఘాతుకానికి పాల్పడిన పదవ తరగతి విద్యార్థులు రూప రెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్లో చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడడం అందరినీ షాక్ కి గురి చేసింది. పూల్ సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన ఇద్దరు పదహారేళ్ల విద్యార్థులు స్కూల్ వసతి గృహం లోనే ఉంటూ చదువుకుంటున్నారు. సెల్ ఫోన్ వాడడం, వ్యసనాలకు బానిసలుగా మారడం వంటి కారణాలతో, ఆ విద్యార్థుల ప్రవర్తనను గుర్తించిన ప్రిన్సిపల్ రూప రెడ్డి తల్లిదండ్రులను పిలిపించింది.టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? నెట్ లో సెర్చ్ చేసిన విద్యార్థులు వారి సమక్షంలో ఇద్దరు విద్యార్థులను కఠినంగా మందలించారు. దీంతో ఆమె పైన కక్ష పెంచుకున్న విద్యార్థులు ఆమె ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని కూడా ఆలోచించి హత్య చేయాలని పథకం రూపొందించారు. దీనికోసం టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? వంటి అనేక పద్ధతులను వారి పరిశోధన చేసినట్టు తెలుస్తోంది.భర్త ఇంట్లో లేని రోజు హత్యకి ప్లాన్రూప రెడ్డిని హత్య చేయాలని భావించిన వారు దానిని ఆమె భర్త ఇంట్లో లేని రోజు అమలు చేయడానికి ప్లాన్ చేశారు. రూపారెడ్డి కుమారుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండడంతో రూపా రెడ్డి దంపతులు తరచు హైదరాబాద్ కు వెళుతుంటారు. ఈనెల ఎనిమిదో తారీకు నుండి వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో రూప రెడ్డి ఆమె భర్త రాజేందర్