
పైలాన్ కాలనీ: వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ చేస్తూ మండపంలోనే పూజారి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్‌ మండలం చింతలపాలెంలో చోటుచేసుకుంది. నాగార్జునసాగర్‌కు చెందిన పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ సోమవారం చింతలపాలెంలోని రామాలయం దగ్గర గణేశ్‌ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య వచ్చి అడ్డుకున్నారు. ముందుగా వారి మండపం దగ్గర పూజలు నిర్వహించాలని పూజారితో గొడవపడ్డారు. తర్వాత గ్రామ పెద్దలు పూజారికి నచ్చజెప్పి గుండాల రవి గణేశ్‌ మండపం వద్దకు తీసుకెళ్లారు. దత్తు ప్రసాద్ అక్కడ పూజలు నిర్వహించి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయన్ను సాగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దత్తుప్రసాద్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.