
భువనగిరి: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై అల్లరిమూకలు, బయటి వ్యక్తులతో దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిశాక రాజకీయాలు పక్కనబెట్టి అందరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలసి ఉండటమే భువనగిరి సంస్కృతి అని గుర్తుచేశారు. హైదరాబాద్లోని ప్రజా భవన్ తరహాలోనే భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిత్యం ప్రజల సేవలో ఉంటుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా విచారించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పుర అధ్యక్షురాలు తంగళ్ల పల్లి శ్రీవాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అవేజ్ చిస్తీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి: రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు పెరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై స్పందిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో భువనగిరి, మునుగోడు, చండూరు తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులపై పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అన్ని ఘటనలపై సమానంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారితో పాటు బాధ్యులైన నాయకులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల పార్టీ కార్యాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ