
భువనగిరి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. భువనగిరి అంబేడ్కర్ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. భవిష్యత్‌లో ఏ ఆలోచనతో చదువులు కొనసాగించాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి వారి చదువులకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.