
హాలియా, న్యూస్టుడే: అక్కా..నీ ఖాతాలో డబ్బులు పడ్డాయి.. బ్యాంకు నుంచి తీసి ఇవ్వు.. వారికి ఇవ్వాలని, అన్నా.. బంగారం తక్కువ రేటుకు వస్తుంది.. అవసరం ఉంటే నగదు ఇవ్వు.. అంటూ కొన్ని సంవత్సరాలుగా తమను నమ్మిన వ్యక్తులను, కుటుంబాలను బురిడి కొట్టించి కోట్లు సొంతం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు చేసిన ఇలాంటి మోసాలకు వందలాది కుటుంబాలు మానసిక వేదన అనుభవిస్తున్నాయి. దీనిలో ఎక్కువ శాతం మధ్య తరగతి కుటుంబాల వారే నష్టపోతున్నారు. పనులు చేసుకొని దాచుకున్న సొమ్మును ఎలాంటి ఆధారాలు లేకుండా నమ్మించి వారి జీవితాల్లో చీకటి నిప్పుతున్నారు. ఇదంతా ఇటీవల రెండు, మూడు నెలల నుంచి హాలియా పురపాలికలో జరిగిన రెండు ఘటనల్లో మోసపోయిన వందలాది బాధిత కుటుంబాల ఆవేదన. కష్టపడకుండా అధిక ధనం వస్తోందని ఆశపడటం మంచిది కాదు. మాయమాటలతో మోసాలకు పాల్పడుతుంటారని రాష్ట్ర పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పునరావృతం కావడం బాధాకరం. ప్రజలు మాయమాటలు నమ్మి డబ్బు ఇవ్వవద్దు. అలాంటి వారి వివరాలు పోలీసులకు అందిస్తే సామాన్య ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు