
నల్గొండ: సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కీలక విషయాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి దొంగతానికి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో గోడదూకి ఇంట్లో ప్రవేశించి చోరీకి పాల్పడిన విద్యార్థిని రూపారెడ్డి గుర్తించడంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెను హత్య చేశాడన్నారు. స్కూల్ ఫీజుల వసూళ్లు జరుగుతుండటంతో ప్రిన్సిపల్ ఇంట్లో డబ్బు ఉంటుందని భావించి ఐదు రోజుల ముందు నుంచే చోరీకి ప్లాన్ చేశారన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘‘రూపారెడ్డి హత్య కేసుపై ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టాం. దీని వెనుక పాత నేరస్థులు, సైకోలు ఉన్నారేమోనని విచారించాం. ఆ ప్రాంతంలోని సుమారు 70 సీసీ కెమెరాలను పరిశీలించాం. వాటి ఆధారంగానే పారిపోతున్న నిందితులను గుర్తించాం. రూపారెడ్డి చివరిసారిగా ఆమె పిన్నితో మాట్లాడుతూ బాబు అనే పదం వాడారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టాం. ఎవరితో ఆమె అలా మాట్లాడారనే విషయంపై ముందుకెళ్లాం. స్కూల్లో పిల్లలను కూడా అలా అంటారేమోనని అక్కడ విచారించాం. ప్రిన్సిపల్ హత్య తర్వాత నాలుగురోజులు ఆ స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. రీఓపెన్ తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల గురించి ఆరా తీశాం. వారిలో ఐదుగురు పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. అందులో ఇద్దరు రెండు మూడు రోజుల నుంచి డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్ ఉన్నట్లు గుర్తించాం. నగదు ఎక్కడిదని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తే మనిషి రక్తంగా తేలింది. నిందితుల్లో ఒకడు అదే స్కూల్ హాస్టల్లో