
భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం దాడి చేశారు. బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లి అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. కార్యాలయం నేమ్ బోర్డుపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ చిత్రపటాలకు నల్ల రంగు పూశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.