
భువనగిరి: వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. భువనగిరి పట్టణ శివారులోని పెద్దచెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ.. చెరువులో నీటిమట్టం అధికంగా ఉన్నందున భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారీకేడింగ్‌తో పాటు క్రేన్లు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రప్రకాశ్‌రెడ్డి, పోలీసు అధికారులు, తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





