© 2026 nimisham.in

Nagpur Forced Conversion Case: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన ఐఏఎఫ్ (IAF) అధికారి భార్య బలవంతపు మతమార్పిడి, లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో తాజాగా హజ్రత్ మౌలానా అనే 24 ఏళ్ల మరో నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి, బలవంతంగా మతం మార్చడంతో పాటు వివాహం జరిపించడంలో ఇతడికి కూడా కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసారు. Read also: Nellore Family Suicide Case : నెల్లూరు జిల్లాలో ఘోరం: ‘దూకెయ్ నాన్నా’ అంటూ కొడుకును ఉరి తీసిన తండ్రి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం.. బాధితురాలు గతంలో తనతో పాటు కలిసి చదువుకున్న అయాజ్ మదారే (26)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హోటల్లో తన డ్రింక్‌లో అయాజ్ మత్తుమందు కలిపి ఇచ్చాడని, తాను స్పృహ కోల్పోయిన సమయంలో అసభ్యకరమైన వీడియోలను రికార్డు చేశాడని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలను భర్తకు, ఇతరులకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి, తనపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే కాకుండా రూ.4 లక్షల నగదును కూడా వసూలు చేశాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. ఈ వేధింపులు అంతటితో ఆగకుండా, నిందితుడు అయాజ్ తన స్నేహితులతో కలిసి బాధితురాలిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ బలవంతపు మతమార్పిడి, నికాహ్ ప్రక్రియలో తాజాగా అరెస్ట్ అయిన హజ్రత్ మౌలానా కీలక పాత్ర పోషించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అయాజ్ మదారేతో పాటు అతడికి సహకరించిన అమీన్ షేఖ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజా అరెస్ట్‌తో కలిపి మొత్తం నిందితుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు
.
US, Iran Sign Peace Deal : పీస్ డీల్ తో భారత్ కు ఈ 60 రోజులు కీలకం..ఎందుకంటే !!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Petrol, Diesel Price Today: దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
Dharmasthala Controversy: ధర్మస్థల వివాదంలో నా ప్రమేయం లేదు: ప్రకాశ్ రాజ్
Versova Beach : బీచ్ నే పడక గదిగా మార్చుకున్న నగరవాసులు..ఎందుకో తెలుసా ?
Rahul Gandhi: నీట్ పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
Supreme Court: సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు