© 2026 nimisham.in
థియేటర్లలో పౌరాణిక, యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతోనే సరికొత్త కాన్సెప్ట్‌తో పీరియాడిక్ డివోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్’. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ , నభా నటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ నుంచి మేకర్స్‌కు ఒకే ఒక విషయంలో గట్టి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అదే.. సినిమా రన్‌టైమ్. కథ బాగున్నా, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడా సాగతీతగా అనిపించిందనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రేక్షకుల అభిప్రాయానికి గౌరవమిస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సినిమాను మరింత వేగంగా, రేసీగా మార్చేందుకు ఏకంగా రన్‌టైమ్‌పై కత్తెర వేశారు.* వాళ్ల రేంజ్ మారిపోయింది.. అందుకే కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు – రాధా రవిల్యాగ్ సీన్లకు చెక్.. 31 నిమిషాల కోతమొదట ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు దీని మొత్తం నిడివి 3 గంటల 16 నిమిషాలుగా ఉండేది. ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు ఇంత సుదీర్ఘమైన రన్‌టైమ్ ఉండటం వల్ల కథనంలో వేగం తగ్గిందనే టాక్ వచ్చింది. దీంతో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కథనంలో అనవసరంగా ఉన్న సాగతీత సన్నివేశాలు, ల్యాగ్‌ను పూర్తిగా తొలగించారు. దాదాపు 31 నిమిషాల నిడివిని ట్రిమ్ చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లో సరికొత్తగా కట్ చేశారు. ఈ ట్రిమ్మింగ్ తర్వాత ‘నాగబంధం’ సరికొత్త నిడివి 2 గంటల 45 నిమిషాలకు కుదించబడింది. ఈ క్రేజీ అప్డేట్ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. నేటి నుంచే థియేటర్లలో ఈ షార్ప్ అండ్ క్రిస్పీ వెర్షన్ ప్రదర్శితం కానుంది.సాధారణంగా దర్శకులు తాము ఎంతో ఇష్టపడి తీసిన కంటెంట్‌లోని సన్నివేశాలను
కట్ చేయడానికి అంత సులభంగా ఒప్పుకోరు. కథపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల నిడివి పెరిగిపోతుంటుంది. కానీ 'నాగబంధం' టీమ్ మాత్రం కమర్షియల్ లెక్కలను, ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా వేగంగా సరైన నిర్ణయం తీసుకుందని ట్రేడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.* ఆఫర్స్ కోసం లొంగిపోవద్దు.. ‘నో’ చెప్పే ధైర్యం ఉండాలి : ఇండస్ట్రీ ఒత్తిళ్లపై నోరు విప్పిన చందమామ మరింత జోష్‌తో నాగసాధువు పోరాటంఈ నిడివి కోత వల్ల సినిమా స్క్రీన్‌ప్లే మరింత షార్ప్‌గా, రేసీగా మారి ప్రేక్షకుడికి సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. శ్రీరంగపురంలోని పవిత్రమైన ‘బ్రహ్మకమలం’ రహస్యాన్ని, ‘నాగబంధం’ ద్వారాలను కాపాడటం కోసం రుద్ర (విరాట్ కర్ణ) అనే యువకుడు నాగసాధువుగా మారి విలన్ జుల్ఫికర్ అలీతో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇప్పుడు అనవసరమైన సీన్లు పక్కకు వెళ్లడంతో, పౌరాణిక ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మరింత ప్రభావవంతంగా ఆడియన్స్‌ను కట్టిపడేసే అవకాశం ఉంది. ఈ తాజా మార్పుతో బాక్సాఫీస్ వద్ద నాగబంధం కలెక్షన్ల జోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.