Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్స్టైల్ సెక్టార్ సంస్థ బిజోటిక్ కమర్షియల్ లిమిటెడ్ ( Bizotic Commercial Limited ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 5:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించగా అందుకు సంబంధించిన రికార్డు డేట్ ని ఆగష్టు 17 కావడం గమనార్హం. ఈ కంపెనీ షేర్స్ ఆ రోజున ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేయనున్నాయి. ఎవరైతే 1 షేర్ కొనుగోలు చేసి ఉంటారో వారు ఏకంగా 5 ఈక్విటీ షేర్స్ బోనస్ రూపంలో అందుకుంటారు. ఒకవేళ 100 షేర్స్ కొని ఉంటే 500 షేర్స్ డీమ్యాట్ ఖాతాలోకి ఉచితంగా వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 154 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కొద్ది రోజుల క్రితం సమావేశంమై 5:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. దీని అర్ధం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే కంపెనీకి చెందిన 1 ఈక్విటీ షేరుని కొని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటే వారికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 ఈక్విటీ షేర్స్ బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. ఈ బోనస్ షేర్స్ పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని ఆగష్టు 17గా నిర్ణయించారు. ఆలోపు షేర్లు కొన్నవారికి ఉచితంగా బోనస్ షేర్లు లభిస్తాయి. అయితే, అందుకు తగినట్లుగానే షేరు ధర తగ్గుతుందని గమనించాలి. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ లో బిజోటిక్ కమర్షియల్ కంపెనీ షేరు 3.5 శాతం లాభంతో రూ. 685.85 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1053 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 265 వద్ద ఉంది