
స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఇప్పుడు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు `అగధ` చిత్రాన్ని తెరకెక్కించారు. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, వనితా విజయ్ కుమార్, రోషన్ బషీర్, షిజు, భాను చందర్ వంటి వారు నటించిన చిత్రమిది. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ఎంఎస్ రాజు సినిమా విశేషాలను పంచుకున్నారు. అందులో భాగంగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా `మళ్లీ పెళ్లి` అనే చిత్రంలో నటించారు. దీనికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్ నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రాన్ని నరేష్ యాంగిల్లో రూపొందించారు. ఆయన తన మూడు పెళ్లిళ్ల విషయంలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ని, మానసిక సంఘర్షణని ఆవిష్కరించారు. ఫ్యామిలీ విషయంలో తనకు సంతోషం లేదనే విషయాన్ని ఇందులో చెప్పారు. నరేష్.. పవిత్ర లోకేష్‌కి ఎందుకు దగ్గరయ్యారనేది చూపించారు. అదే సమయంలో పవిత్ర లోకేష్..ఎందుకు నరేష్‌కి దగ్గర కావాల్సి వచ్చింది? వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లో ఆడలేదు. మార్నింగ్ షో తప్ప మాట్నీ నుంచే థియేటర్ల నుంచి ఎత్తేశారు. ఈ క్రమంలో తాజాగా దీని గురించి దర్శకుడు ఎంఎస్ రాజు స్పందించారు. ఆ మూవీ నరేష్‌తో ఉన్న రిలేషన్ కోసం తీసినట్టు తెలిపారు. ఆబ్లిగేషన్లోనే చేశామని ఆయన తెలిపారు. ఆ సినిమా ఫలితంపై స్పందిస్తూ, సినిమా తీశాక ఇది థియేటర్ ఫిల్మ్ కాదనిపించిందన్నారు. ఇది థియేటర్లో ఆడే సినిమా కాదు, ఓటీటీ ఫిల్మ్ అని అప్పుడే అనిపించిందన్నారు. ఓటీటీలో మాత్రం అదిరిపోయే వ్యూస్‌ని సాధించిందని చెప్పారు. ఇక `అగధ`