
మహేష్ బాబుకి ఒక్కడు, ప్రభాస్ కి వర్షం, సిద్ధార్థ్ కి నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి భారీ హిట్స్ ఇచ్చిన నిర్మాత ఎం.ఎస్. రాజు (MS Raju) ఇటీవల దర్శకుడిగా మారిపోయారు. సినిమాల నిర్మాణం ఆపేశారు. ఆయన డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం ‘అగధ’ (Agadha) ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలు…. ‘అగధ’ అంటే ఏంటి? ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నట్లు ఉన్నారు? ‘అగధ’ అంటే ఏమి కనిపించని లోతైన శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. నేను ఇంత వరకు స్టేజ్ మీద అలా ఓపెన్‌గా సినిమా బాగుంది అని స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ‘అగధ’ చూసిన తర్వాత సినిమా బాగుంది, విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది. అదే విషయాన్ని చెప్పా. ట్రైలర్, టీజర్ చూసి మీ పాత హీరోలు ఏమైనా స్పందించారా? ‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసెజ్ చేశారు. ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్ అన్నారు. ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు. త్రివిక్రమ్ షూటింగ్లో ఉండగానే వెంకటేష్‌ని కలిశాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మీరు సడెన్‌గా సినిమాల్ని నిర్మించడం ఆపేశారు.. ఎందుకు? ‘ఆట’, ‘మస్కా’ మంచి చిత్రాలు. కమర్షియల్‌గా విజయాలు అందుకున్నాను. కానీ నా స్టాండర్డ్‌లో లేవు అని చాలా మంది అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయి కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టాను. చాలా ఏళ్ల తర్వాత ‘డర్టీ హరి’ని తీశాను. అది నా టేస్ట్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. నా జర్నీలో ఎప్పుడూ కూడా కొత్త కథలకే ఓకే చెబుతూ వచ్చాను. ఎం.ఎస్. రాజు ఎలాంటి జానర్లో అయినా కూడా సినిమా తీయగలడు అనే పేరు సంపాదించుకోవాలి. నాకు నచ్చిన ఆర్ట్