
ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం అగధ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చేసింది. ఎమ్మెస్ రాజు.. 'అగధ' మూవీ రివ్యూ! Agadha Movie Review ఎం.ఎస్.రాజు (M.S. Raju) సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత. అయితే దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. నిర్మాతగా కంటే దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ఆసక్తి చూపించే ఎమ్మెస్ రాజు తాజాగా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా 'అగధ' (Agadha) మూవీని రూపొందించారు. 'పొలిమేర'తో నటిగా చక్కని గుర్తింపు పొందిన కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) కీలక పాత్ర పోషించిన 'అగధ' ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్ స్పిరిట్ రిలేటెడ్ మూవీనే. కాకపోతే దీని నేపథ్యం ఉత్తరాంధ్ర అవతల ఉన్న బస్తర్ సమీప గ్రామాలతో ముడిపెట్టింది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) దెయ్యం పట్టిన వారిని మామూలు మనుషులను చేస్తుంటుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి సిటీ నుంచి మానస (శ్రేయరాణి), సంజయ్ (రోషన్) వెళ్తారు. వాళ్ళకు తన గతాన్ని చెప్పిన మహాదేవి అదే సమయంలో తన కుటుంబం ఆపదలో ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది. తన బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి, ఆత్మహత్య చేసుకున్న విషయం మహాదేవికి తెలుస్తుంది. ఆ ఇంటిలో మరికొన్ని ఆత్మలు ఉన్నాయనే సంగతి ఆమెకు అక్కడికి వచ్చాక అర్థమౌతుంది. మహిమ ఆత్మహత్య వెనుక కలి నుంచి ఉద్భవించిన ఘోర క్షుద్రశక్తి 'అగధ' ఉందనే విషయం మహాదేవి గ్రహిస్తుంది. మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్‌రెడ్డి) ఆచూకీ లేకపోవడానికి, వారి స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) కిరాతక హత్యకు, తదనంతరం మహిమ ఆత్మహత్యకు 'అగధ' కారణమని మహాదేవి