
నటీనటులు : కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్త, శ్రవణ్ రెడ్డి, వైవా రాఘవ్, జోవిక విజయ్, షిజు అబ్దుల్ రషీద్, రోషన్ బషీర్ తదితరులు దర్శకత్వం : ఎం ఎస్ రాజు నిర్మాత : కాశీ విశాలాక్షి బలుసు సంగీతం : రాకేష్ వెంకటాపురం ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి కూర్పు : జునైద్ సిద్దిఖీ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఛత్తీస్ ఘర్, బస్తర్ అటవీ ప్రాంతంలో పోలీసులు బ్యాన్ చేయబడిన ఒక మిస్టీరియస్ గుహ లోకి వెళదామని యూట్యూబర్స్ అయ్యిన ముగ్గురు స్నేహితులు మహిమ (ఉల్కా గుప్త), షామ్ (శ్రవణ్ రెడ్డి) అలాగే బబ్లు (వైవా రాఘవ్) వెళతారు. కానీ ఊహించని విధంగా షామ్ మిస్సవుతాడు, బబ్లు చనిపోతాడు. ఈ క్రమంలో తప్పించుకున్న మహిమ కూడా కొన్ని నెలల తర్వాత చనిపోతుంది. అసలు వీరంతా ఎందుకు చనిపోయారు? మిస్సయిన షామ్ కి ఏమైంది? ఈ మరణాల మిస్టరీ వెనుక ఉన్న అగధ (?) ఎవరు? ఈ మిస్టరీ ఛేదించడానికి వచ్చిన యోగిని మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఏం చేసింది? ఆమెకి మహిమకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఆమె ఆ మిస్టరీ కనుక్కుందా లేదా? అగధ ని ఎలా ఆపుతుంది అనేది ఇందులో మిగతా కథ. దర్శకునిగా మారిన తర్వాత ఎం ఎస్ రాజు నుంచి ఇది మరో కొత్త కాన్సెప్ట్ గా టచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ తో కూడిన కొన్ని సీన్స్ అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఒకటీ రెండు చోట్ల డివోషనల్ మూమెంట్స్ ఎగ్జైట్ చేస్తాయి