
కొత్త మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ లాంచ్ 7000mAh బ్యాటరీ, 50ఎంపీ సోనీ కెమెరా 128GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ Motorola G Max Launch : మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో కొత్త జి సిరీస్ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్, పాంటోన్, శాటిన్-ఫినిష్ డిజైన్‌తో వస్తుంది. అలాగే, 120Hz డిస్ప్లే, ఏఐ-అసిస్టెంట్ ఫొటోగ్రఫీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త మోటోరోలా ఫోన్ వచ్చే వారం ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ధర, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి. మోటోరోలా G మాక్స్ స్పెసిఫికేషన్లు : మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. వాటర్ టచ్ టెక్నాలజీ అందిస్తుంది. ఈ ఫోన్ 4nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. 6GB LPDDR5X ర్యామ్, వర్చువల్ ర్యామ్ బూస్ట్ ద్వారా 18GB వరకు పెంచుకోవచ్చు. 128GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. 33W ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. రెండు ఏళ్ల ఓఎస్ అప్గ్రేడ్లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది. Read Also : Flipkart Freedom Sale : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత తగ్గిందంటే? కెమెరా విషయానికి వస్తే.. : ఈ మోటోరోలా ఫోన్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 50MP సోనీ లైటియా, 600 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఆటోఫోకస్ కొరకు స్పెషల్ యాంబియంట్ లైట్ సెన్సార్‌తో 32MP