
6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సిడి స్క్రీన్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది 50MP సోనీ లైటియా 600 మెయిన్ కెమెరా సెటప్ Moto G Max Sale : మోటో అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త మోటో G మ్యాక్స్ ఇటీవలే లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. దేశంలో మోటోరోలా నుంచి రెండో 'మ్యాక్స్' స్మార్ట్‌ఫోన్.. గత నెలలో మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ అయింది. మోటో జీ మ్యాక్స్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ కొనే ముందు ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ ధర రూ. 27,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనే యూజర్లు బ్యాంకు నుంచి రూ. 3వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ కంపెనీ 18 నెలల పాటు 5,000GB క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో యాక్సెస్‌తో జియో బెనిఫిట్ అందిస్తోంది. మోటో జీ మ్యాక్స్ పాంటోన్ అలస్కాన్ బ్లూ, పాంటోన్ మలగా పాంటోన్ స్టార్‌గేజర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. Read Also : Apple iPhone 17 : ఆపిల్ ఫోన్ మీ డ్రీమా.. ఈ ఐఫోన్ 17 భారీగా తగ్గిందోచ్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..! స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 6.72-అంగుళాల 1,080 x 2,400 పిక్సెల్స్, ఫుల్ HD+ LCD స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz, పిక్సెల్ డెన్సిటీ 391ppi టాప్ బ్రైట్నెస్