© 2026 nimisham.in
టీమిండియా లెజండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజులో ఆయన ఉంటే ఔట్ చేయడం బౌలర్లకు సవాల్‌గా ఉండేది. రాహుల్ ద్రవిడ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆయనను అందరూ అభిమానంతో ‘ది వాల్’ అని పిలిచేవారు. పిచ్‌పై ఎంతో ఓర్పుతో, నిలకడగా ఆడే ఆయన శైలే దానికి కారణం. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ద్రవిడ్ ఒకరు. భారత్ ఓడిపోతుందనుకున్న ఎన్నో మ్యాచ్‌ల్ని తన ఒంటిచేతి పోరాటంతో గెలిపించారు. ఆయనొక కూల్ పర్సన్, సంయమనం ఉన్న వ్యక్తిత్వం.. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.చాలామంది గొప్ప వ్యక్తుల్ని కేవలం వారి వృత్తికే పరిమితం చేస్తుంటారు. రాహుల్ ద్రవిడ్‌ను కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూస్తే, ఆయన గొప్పదనాన్ని తక్కువగా అంచనా వేసినట్లే. టీమిండియా హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించిన ద్రవిడ్ మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. వివిధ సందర్భాల్లో రాహుల్ ద్రవిడ్ చెప్పిన 10 మోటివేషనల్ కోట్స్‌పై ఓ లుక్కేద్దాం.1. విజయం వయసుతో రాదు!"మీరు 15 ఏళ్ల వయసులో విజయం సాధించినంత మాత్రాన, 19 ఏళ్ల వయసులో కూడా విజయం సాధిస్తారని గ్యారెంటీ లేదు. విజయం వయసుపై ఆధారపడి ఉండదు. మానసికంగా బలంగా ఉంటూ, ప్రతిరోజూ మన నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది."2. సహనమే విజయానికి పునాది!ఎవరికైతే ఓర్పు, సహనం ఉంటాయో, వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ద్రవిడ్ అభిప్రాయం ప్రకారం సహనమే నిజమైన విజయానికి పునాది.3. మీ నుంచి మీరు బెస్ట్ కోరుకోకపోతే ఏదీ దక్కదు!"మీరు మీ అంతట మీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను (బెస్ట్) ఆశించనంత వరకు, ఆ బెస్ట్ రిజల్ట్ మీకు లభించదు."4. కక్ష తీర్చుకోవడం కోసం కాదు.. గౌరవం కోసం!"మనం ఎవరిపై అయినా పగ లేదా కక్ష తీర్చుకోవడానికి ఆడకూడదు; దేశం యొక్క గౌరవం, ఆత్మగౌరవం కోసమే ఆడాలి."5. కలల్ని ఒంటరిగా నిజం చేసుకోలేం!ఏ పెద్ద విజయం వెనకైనా ఎంతోమంది వ్యక్తుల శ్రమ
, సహకారం ఉంటాయి. "ఏ ఒక్కరూ తమ కలను ఒంటరిగా నెరవేర్చుకోలేరు" అని ద్రవిడ్ నమ్ముతారు.6. ఆరంభమే మీ గుర్తింపుగా మారుతుంది!"క్రికెట్ అయినా లేదా మరేదైనా రంగమైనా.. మీ కెరీర్ తొలి రోజుల్లో మీకొక గుర్తింపు ఏర్పడుతుంది. ఆ గుర్తింపు మీకు నచ్చినా, నచ్చకపోయినా జీవితాంతం దాంతోనే ప్రయాణించాల్సి వస్తుంది."7. గెలవడానికి కోట్లాది దారులు ఉన్నాయి!"నిజం చెప్పాలంటే విజయం సాధించడానికి కోట్లాది మార్గాలు ఉన్నాయి. కానీ అందులో ఏది మీకంటే సరిపోతుందో నేను చెప్పలేను. మన మార్గాన్ని మనమే వెతుక్కుని ఎంచుకోవాలి."8. నేను విఫలమయ్యాను.. కానీ ప్రయత్నించడం ఆపలేదు!"నేను నా జీవితంలో ఎన్నోసార్లు విఫలమయ్యాను, కానీ ప్రయత్నించడం ఎప్పుడూ ఆపలేదు." జీవితంలో దేనినైనా సాధించాలంటే ఓటమి కంటే ప్రయత్నమే అత్యంత కీలకమైంది.9. విజయం మీ ఒక్కరి త్యాగంతోనే రాదు!"ఏ ఒక్క విజయవంతమైన కెరీర్ కూడా మీ ఒక్కరి త్యాగాలతోనే నిర్మితమవ్వదు. అందులో ఎంతోమంది ఆత్మీయులు ఉంటారు. అందుకే మీరు మంచి విజయం సాధించినప్పుడు, మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు."10. చీఫ్ గెస్ట్ అవ్వడానికి మ్యాథ్స్, ఫిజిక్స్ మార్కులు అవసరం లేదు!ద్రవిడ్ ఒక పాఠశాల కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకప్పుడు తను చదివిన స్కూల్లో పాస్ అవ్వడానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో 75% మార్కులు రావాల్సి ఉండేదని, కానీ ఈ రోజు అదే కాలేజీకి చీఫ్ గెస్ట్‌గా రావడానికి ఆ మార్కులు అవసరం లేకపోయిందని సరదాగా గుర్తుచేసుకున్నారు. దీని అర్థం చదువు ఒక్కటే మార్గం కాదు, మీరు చేసే పనిని మనస్ఫూర్తిగా, గొప్పగా చేస్తే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.రాహుల్ ద్రవిడ్ గురించి ముఖ్యమైన విషయాలుఅడిలైట్ చారిత్రాత్మక టెస్ట్ (2003): ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైట్ టెస్ట్‌లో ద్రవిడ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా 72 పరుగులు చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.యువతను తీర్చిదిద్దడంలో పాత్ర: సీనియర్ జట్టుకు కోచ్ అవ్వడానికి ముందు India A, Under-19 జట్లకు కోచ్‌గా వ్యవహరించి శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ వంటి ఎంతోమంది యంగ్ స్టార్స్‌ను భారత జట్టుకు అందించారు.