నీటి మంచు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నీటి మంచు భవిష్యత్తులో లభ్యమైతే.. చంద్రుడిపై మనుషుల జీవనానికి ఎంతో ఉపయోగపడుతుంది. నీరు అంటే కేవలం తాగడానికి మాత్రమే కాదు.. చంద్రుడిపై మనిషి జీవించడానికి ఇది చాలా కీలకం. నీటిని విడగొట్టడం ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయవచ్చు. ఆ ఆక్సిజన్‌ను వ్యోమగాములు శ్వాసించేందుకు ఉపయోగించొచ్చు. అంతేకాదు.. నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను భవిష్యత్తులో రాకెట్లకు అవసరమైన ఇంధనం తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. అంటే.. భూమి నుంచి ప్రతిసారీ నీరు, ఆక్సిజన్, ఇంధనం తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కొంతవరకు తగ్గించవచ్చన్నమాట. అయితే చంద్రుడిపై జీవించడం అంత సులభం కాదు. భూమిలా అక్కడ వాతావరణం లేదు. మనుషులు నేరుగా శ్వాసించేందుకు గాలి ఉండదు. సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో తీవ్రమైన వేడి.. చీకటిగా ఉండే ప్రాంతాల్లో తీవ్ర చలి ఉంటుంది. అంతేకాదు.. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి కూడా రక్షణ అవసరం. చంద్రుడి ఉపరితలంపై ఉండే సన్నని దుమ్ము కూడా పరికరాలకు, వ్యోమగాముల దుస్తులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అందుకే చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయడం అంటే.. కేవలం కొన్ని గదులను అక్కడికి తీసుకెళ్లి పెట్టడం కాదు. మనుషులు సురక్షితంగా జీవించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేయాలి. విద్యుత్ కావాలి.. నీరు కావాలి.. ఆక్సిజన్ కావాలి.. ఆహారం కావాలి.. భూమితో నిరంతర సంబంధం ఉండాలి. అంతేకాదు.. అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించే వ్యవస్థలు కూడా అందుబాటులో ఉండాలి. ఇక ఈ ప్రాజెక్టులో భారత్‌కు ఎందుకు ప్రాధాన్యత లభిస్తోంది? దీనికి ప్రధాన కారణం చంద్రయాన్-3. 2023లో భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా ల్యాండర్‌ను దించింది. ఈ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశీలించడంలో ఇస్రోకు ప్రత్యేక అనుభవం వచ్చింది. ఇప్పుడు నాసా కూడా చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ నివాసం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో.. ఇస్రోతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇటీవల అమెరికా, భారత్ మధ్య జరిగిన అంతరిక్ష చర్చల్లో.. నాసా చంద్ర స్థావర కార్యక్రమంలో ఇస్రోను భాగస్వామ్యం కావాలని ఆహ్వానించింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చంద్ర స్థావరంలో ఇస్రోకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆహ్వానం మాత్రం భారత అంతరిక్ష రంగానికి చాలా ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. మరి నాసా, ఇస్రో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల అంతరిక్ష సంస్థలు కూడా ఎందుకు కలిసి పనిచేస్తున్నాయి? కారణం చాలా సులభం. చంద్రుడిపై మనుషులు ఎక్కువ కాలం నివసించే స్థావరం ఏర్పాటు చేయడం ఒక్క దేశం వల్ల సాధించే పని కాదు. దీనికి భారీ ఖర్చుతో పాటు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎన్నో సంవత్సరాల పరిశోధన, ప్రత్యేక నైపుణ్యం అవసరం. ఒక్కో దేశానికి ఒక్కో రంగంలో ప్రత్యేక అనుభవం ఉంది. ఆ అనుభవం, సాంకేతికతను కలిపి పనిచేస్తే.. చంద్రుడిపై మానవ స్థావరాన్ని మరింత వేగంగా, సురక్షితంగా అభివృద్ధి చేయవచ్చన్నదే ఈ అంతర్జాతీయ సహకారం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతేకాదు.. చంద్రుడిపై మనిషి నివసించగలిగితే దాని ప్రయోజనం చంద్రుడికే పరిమితం కాదు. భవిష్యత్తులో అంగారక గ్రహానికి మనుషులను పంపాలంటే.. అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడం, పరిమిత వనరులతో జీవించడం, ఇతర గ్రహాలపై నీరు, ఆక్సిజన్ వంటి వనరులను ఉపయోగించుకోవడం వంటి విషయాలపై ముందుగానే అనుభవం కావాలి. అందుకే చంద్రుడిని భవిష్యత్తులో అంగారక గ్రహ ప్రయాణానికి ఒక పరీక్షా వేదికగా కూడా చూస్తున్నారు. “అయితే వచ్చే ఆరేళ్లలోనే చంద్రుడిపై భూమ్మీద ఉన్నట్టుగా ఒక పెద్ద నగరం ఏర్పడుతుందా అంటే.. అది ఇప్పుడే చెప్పడం కష్టం. 2032 నాటికి పూర్తిస్థాయి శాశ్వత నగరం ఏర్పడుతుందని నాసా చెప్పడం లేదు. బదులుగా.. వ్యోమగాములు చంద్రుడిపై ఎక్కువ కాలం ఉండి పరిశోధనలు చేయగలిగే స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యం. ముందుగా యంత్రాలు, రోవర్లు వెళ్తాయి. తర్వాత పరిశోధనలు, నీటి మంచు అన్వేషణ, విద్యుత్ ఏర్పాట్లు జరుగుతాయి. ఆ తర్వాత మనుషులు ఉండేందుకు అవసరమైన స్థలాలను సిద్ధం చేస్తారు. ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చంద్రుడిపై మానవ ఉనికిని కొనసాగించాలన్నదే అసలు లక్ష్యం.” ఒకప్పుడు చంద్రుడిపై మనిషి అడుగుపెట్టడమే అసాధ్యమని అనుకున్నారు. కానీ 1969లో మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఇప్పుడు అక్కడే ఎక్కువ కాలం నివసించే స్థావరం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముందుకు వచ్చింది. ఈ ప్రయత్నంలో అమెరికాతో పాటు భారత్, జపాన్, యూరప్ సహా అనేక దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అందుకే.. వచ్చే ఆరేళ్లలో చంద్రుడిపై ఒక పెద్ద మానవ నగరం ఏర్పడకపోయినా.. అక్కడ మనిషి నిరంతరం ఉండేందుకు అవసరమైన తొలి పునాది మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. భూమి తర్వాత మరో ఖగోళ వస్తువుపై మనిషి స్థిరమైన ఉనికికి ఇది తొలి అడుగు కావచ్చు. మరి ఆ అడుగు ఎంత వేగంగా ముందుకు వెళ్తుంది? చంద్రుడిపై ఉండే నీటి మంచు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిజంగా మనిషి అక్కడ శాశ్వతంగా జీవించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే తెలుస్తుంది.
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు!
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే..
Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..