
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎలా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) వెండితెర అరంగేట్రం (Tollywood Debut) కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రతీసారి ఎంట్రీకి అంతా సిద్ధమైంది అనుకున్న తరుణంలో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. గతంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని, పూజా కార్యక్రమాలు కూడా ఖరారయ్యాయని ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా నిలిచిపోయింది. ఆ తర్వాత స్వయంగా బాలయ్యే మెగాఫోన్ పట్టి ‘ఆదిత్య 999’తో కొడుకును లాంచ్ చేస్తారని వార్తలొచ్చాయి. అనంతరం క్రిష్ జాగర్లమూడి పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ డైరెక్టర్ల లిస్ట్‌లోకి ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడి పేరు వచ్చి చేరింది. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ కొట్టి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న యువ దర్శకుడు వశిష్ట (Vassishta Mallidi) పేరు ఫిలింనగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. వశిష్ట చెప్పిన ఒక సరికొత్త ఫాంటసీ కమ్ మాస్ కథకు బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డెబ్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. నందమూరి నట వారసుడికి తగ్గట్టుగా భారీ కాన్వాస్‌పై ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇటీవల షూటింగ్లో బాలయ్యకు స్వల్ప గాయం కావడం, చికిత్స నేపథ్యంలో ఈ అనౌన్స్‌మెంట్‌ను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే దసరా పండుగ శుభ సందర్భంగా